వివాదాలకు కాస్తంత దూరంగా ఉండే మెగా ఫ్యామిలీలో రాంచరణ్ రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి రాంచరణ్‌కు వివాదాలు కొత్తకాదు. ఒకసారి ఆయనగారి ఆగ్రహాన్ని రోడ్డు మీద ప్రదర్శించటాన్ని మర్చిపోలేరు. ఇద్దరు టెకీల మీద ఆయనగారి ప్రతాపం అప్పట్లో వైరల్ అయ్యింది.
తాజాగా.. తన ఇంటివద్ద ఫ్రెండ్స్‌కు ఇచ్చిన పార్టీ వివాదానికి కారణమైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 25లో నివసించే రాంచరణ్ నివాసంలో శనివారం రాత్రి ప్రారంభమైన విందు ఆదివారం తెల్లవారుజాము వరకు సాగింది.
ఈ పార్టీకి ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడితో పాటు.. మరో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అర్థరాత్రి దాటాక కూడా వారి అరుపులు.. కేకలు స్థానికులకు తీవ్ర ఇబ్బందిని కలిగించాయి.
రాంచరణ్ ఇంటి పక్కనే నివాసం ఉండే సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్.. ఈ రచ్చ తట్టుకోలేక 100కు ఫోన్ చేసి.. జరుగుతున్న ఘటనపై సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎస్‌ఐ తన సిబ్బందితో రాంచరణ్ ఇంటి వద్దకు చేరుకొని ఆయన్ను పార్టీ ఆపేయాలని కోరారు. దీనికి చెర్రీ నో చెప్పటంతో పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. ఇలాంటి 'సీన్లు' ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీలో కనిపించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
source:http://telugu.gulte.com/tmovienews/8530/Case-files-on-Ram-charan-party

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.