ఇప్పటి దాకా ఊహగానాలుగా నడిచిన నాగ్ రాఘవేంద్రరావుల సినిమాకు సంబంధించిన వార్తల పై అధికారికంగా నాగార్జున స్పందించాడు. ఇటీవలే రాఘవేంద్రరావుగారు నాకు ఓ కథ చెప్పారు అని అంటూ ఆ కథ తన మనసును కదిలించి వేసింది అని అన్నాడు నాగ్. అంతేకాదు ఆ సినిమాలో తాను నటించడానికి రెడీ అని రాఘవేంద్రరావుకు తెలిపానని మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తానని నాగార్జున అధికారికంగా తెలియచేసాడు.
దీనితో నాగ్ రాఘవేంద్రరావుల కొత్త సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది అనుకోవాలి. అయితే ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా 'ఏడు కొండలవాడు' అనే టైటిల్ తో ఒక భక్తిరస ప్రధాన చిత్రంగా రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సినిమాలకు స్క్రిప్ట్ రచించడంలో అందవేసిన చేయిగా పేరుగాంచిన రచయిత భారవి ఈ సినిమా స్క్రిప్ట్ ను చాల పరిశోధించి తయారు చేస్తున్నాడని టాక్.
చాల సంవత్సరాల క్రితం నందమూరి తారకరామారావు జీవించి ఉన్న రోజులలో వెంకటేశ్వరస్వామి జీవితం పై ఒక సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఛాయలు ఈ సినిమా పై ఏ మాత్రం ఉండకుండా వెంకటేశ్వరస్వామి అవతారంలోని విశిష్టతను చారిత్రక ఆధారాలతో పరిశీలించి ఈ స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారని టాక్.
ఇప్పటికే ‘అన్నమయ్య’, ‘షిరిడీ సాయిబాబా’ సినిమాలతో మంచి కాంబినేషన్ గా పేరుతెచ్చుకున్న వీరిద్దరూ చేస్తున్న ఈ ప్రయత్నం మరో సంచలనమే అవుతుంది. ఎన్టీఆర్ తరువాత కొన్ని ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ నాగార్జున తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నాడు.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78165/ANNAMAYYA-BECOMES-VENKATESWARASWAMY/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.