స్టార్ హీరోల మూవీలు షూటింగ్స్ జరుగుతున్నంత కాలం, ఏదొక గాసిప్ బయటకు
వస్తూనే ఉంటుంది. అలాగే ఆ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న హీరోయిన్స్ పైనా
గాసిప్స్ బయటకు వస్తుంటాయి. ప్రస్తుతం అటువంటిదే గత కొంత కాలంగా ఫిల్మ్
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చక్కెర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే అల్లు
అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందనే
విషయం తెలిసిందే.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయంలో నిత్యామీనన్ ని టాలీవుడ్ మీడియా టార్గెట్ చేసింది. ఆఫర్స్ లేక అల్లుఅర్జున్ కి చెల్లిగా నిత్యామీనన్ నటిస్తుందనే టాక్స్ బయటకు వచ్చాయి.
అలాగే నిత్యామీనన్, అల్లుఅర్జున్ చెల్లిగా నటిస్తుందంటూ వచ్చిన వార్తల్లో నిజం ఉందని నిత్యానే స్వయంగా చెప్పినట్టు కూడ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏ విషయంలోనూ నిజం లేదని తాజాగా తెలిసింది. మాకు అందిన క్లియర్ న్యూస్ ప్రకారం త్రివిక్రమ్ సినిమాలో నిత్యా మీనన్, అల్లు అర్జున్ సిస్టర్ కాదని స్పష్టంగా తెలిసింది. చిత్ర యూనిట్ కి చెందిన వారి నుండి ఈ సమాచారం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం.
సమంత, అదా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తర్వాత పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళ్లనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. వేసవి ప్రధమార్ధంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం వంటి అగ్రతారలు ఈ మూవీలో నటిస్తున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78998/Trivikram-nithyamenon-tollywood-julai-allu-arjun-t/

0 comments:
Post a Comment