March 14, 2025 03:02:29 PM Menu
Latest

6:28 PM test1

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. ఈ మూవీకి సంబంధించి మొదటి భాగం రిలీజ్ ఈ సంవత్సరంలోనే ఉంది. దీంతో బాహుబలి మొదటి భాగం థియోట్రికల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? అంటూ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ సైతం ఎదురుచూస్తుంది. వివరాల్లోకి వెళితే, ‘బాహుబలి ' మూవీకి సంబంధించి మొదటి భాగం షూటింగ్ పార్ట్ పూర్తయింది.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సాంగ్స్ చిత్రీకరణ జరుగుతోంది. వీటికి సంబంధించిన అప్ డేట్స్ ని స్వయంగా రాజమౌళినే బయటకు చెబుతున్నాడు. బాహుబలి మూవీ ట్రైలర్, అలాగే ఆడియో ఫంక్షన్, మూవీ రిలీజ్ డేట్ వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా బాహుబలి వస్తున్నాడు... అంటూ రాజమౌళి తను తెరకెక్కిస్తున్న బాహుబలి మూవీపై హైప్ ని క్రియేట్ చేస్తున్నాడు.

‘బాహుబలి' తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ రాని ఒక అద్భుదమైన చిత్రం. దాదాపు 100 కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. దాదాపు రెండేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. బాహుబలి పార్ట్-1 ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపు 100 కోట్ల బిజినెస్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది. తమిళ రైట్స్ ఇప్పటికే రూ. 27 కోట్లు వెచ్చించి యువి ప్రొడక్షన్స్ రైట్స్ ని తీసుకుంది. స్టూడియోగ్రీన్ సహకారంతో ఈ చిత్రాన్ని అక్కడ భారీగా విడుదల చేయనున్నారు. తమిళ రైట్స్ అమ్మడం ద్వారా వచ్చి రూ. 27 కోట్ల మొత్తాన్ని ప్రభాస్ రెమ్యూనరేషన్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఎందుకంటే గత రెండేళ్లుగా ప్రభాస్ ఇతర సినిమాలేవీ చేయకుండా కేవలం ఈ సినిమా కోసమే పని చేస్తున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79022/Baahubali-baahubali-tamil-mahaabali-mahaabali-news/

18 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top