Menu

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగిన హీరో మహేష్ బాబు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే, మహేష్ బాబు తరువాత చిత్రం షూటింగ్ కి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్స్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరో టాప్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ, ఇప్పుడు మహేష్ బాబు సరసన ఓ బ్యూటి హాట్ ఆఫర్ ని చేజిక్కించుకుంది. శృతి హాసన్,

సమంత, కాజల్ అగర్వాల్, అనుష్క వంటి అగ్ర హీరోయిన్లు ఆ పాత్రకి సరిపోయినప్పటికీ, ప్రిన్స్ సరసన రకుల్ ఫ్రీత్ సింగ్ హీరోయిన్ గాఆ ఫర్ ని సొంతం చేసుకుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకేక్కబోయే ‘బ్రహ్మోత్సవం’లో హీరోయిన్ గురించి ఫిల్మ్ నగర్ లో టాక్స్ నడుస్తున్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబుతో జోడి కట్టే అవకాశం దాదాపు ఖరారైనట్టేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బ్రహ్మోత్సవం అనే మూవీలో హీరోయిన్ గా నటించటానికి కాజల్, సమంత, శృతిహాసన్ లని మొదటగా, దర్శకుడు సంప్రదించాడు. అందుకు ఈ హీరోయిన్స్ దాదాపు కోటి రూపాయలను డిమాండ్ చేయటమే కాకుండా, కండిషన్స్ ని కూడ పెట్టారు. దీంతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదిస్తే, వెంటనే ఒప్పుకోవడమే కాకుండా తనకు రెమ్యునరేషన్ తో పట్టింపు లేదు,

ఆఫర్ ని మాత్రం లాక్ చేయండి అని దర్శకుడి వద్ద మాట తీసుకుందట. దీంతో రకుల్ ప్రీత్ సింగ్, ప్రిన్స్ సరసన నటించేందుకు సిద్ధం అంటూ వార్తలు వస్తున్నాయి. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో అనతికాలంలో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటుంది. ‘కిక్ 2′, ‘పండగ చేస్కో’ సినిమాలలో నటిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొత్త సినిమాలలో ఆమె హీరోయిన్.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79008/Tollywood-mahehbabu-koratalashiva-koratalashiva-fi/a

0 comments:

Post a Comment

 
Top