Menu


ఎటువంటి పండుగ హడావిడి లేకపోయినా గత శుక్రువారం విడుదలైన ‘టెంపర్’ టాలీవుడ్ కలెక్షన్స్ ‘టెంపర్’ ను పెంచేస్తూ ఏకంగా టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ రికార్డులను టార్గెట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం టాలీవుడ్ సంచలనంగా మారిపొయింది. సంక్రాంతికి విడుదలైన పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ విడుదలైన మొదటి నాలుగు రోజులలో 24 కోట్లను వసూలు చేస్తే జూనియర్ ‘టెంపర్’ కేవలం మూడు రోజులలో 25 కోట్లు వసూలు చేయడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.

ఈ వార్తల నేపధ్యంలో పవన్ సన్నిహితులు కొందరు పవన్ ఈ సంవత్సరం తన సినిమాల ఎంపికలో ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ విషయంలో సరైన శ్రద్ధను కనపరచకపోతే భవిష్యత్ లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని సలహాలు ఇస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. అంతేకాదు ఈమధ్యనే మాస్ మసాల అంశాలతో కళ్యాణ్ రామ్ కు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన ఒక మసాల కథను అలాగే క్రియేటివ్ దర్శకుడు క్రిష్ ఎప్పటి నుంచో పవన్ కోసం వ్రాసి రెడీ పెట్టిన కథలను ఒక్కసారి మనసు పెట్టి వినవలసిందిగా పవన్ కళ్యాణ్ పై కొందరు సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నట్లు టాక్.

అయితే సినిమా హీరోల మధ్య ఉండే పోటీని అదేవిధంగా వరస పెట్టి సినిమాలు చేసే విషయంలో పెద్దగా ఆ శక్తిని కనపరచని పవన్ ఈ సలహాలను మన్నిస్తాడా అన్న ప్రశ్న చాలామందిలో ఉంది. దీనికి తోడు మళ్ళీ ‘గబ్బర్ సింగ్2’ షూటింగ్ విషయంలో పవన్ మరి కొంత గ్యాప్ తీసుకుంటున్నాడు అని వార్తల వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన రికార్డులు మిగతా హీరోలు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కొంతవరకు పవన్ కళ్యాణ్ కు షాకింగ్ న్యూస్ అనే అనుకోవాలి.

 

source:http://www.apherald.com/Movies/ViewArticle/78941/TEMPER-GIVING-SHOCK-TO-PAVAN/

0 comments:

Post a Comment

 
Top