Menu


టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాక్సాపీస్ వద్ద దుమ్మురేపుతున్న చిత్రం టెంపర్. టెంపర్ మూవీకి సంబంధించిన టాక్స్ అన్ని చోట్ల వినిపించడంతో, సాధారణ సినీ ప్రేక్షకులు సైతం టెంపర్ మూవీని చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే టెంపర్ మూవీ సక్సెస్ తరువాత, ఎన్టీఆర్ మొదటి సారిగా డైరెక్టర్ పూరీ జగన్నాధ్ పై కామెంట్ చేశాడు.

టెంపర్ మూవీ విషయానికి వస్తే, తన కెరీర్ లో ఎన్టీఆర్ మొదటిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ విషయం గురించే ఎన్టీఆర్ మాట్లాడుతూ, "మొదట నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించడానికి నేను సందేహించాను. షూటింగ్ జరిగే సమయంలో సైతం, నా క్యారెక్టర్ పై నాలో చాలా సందేహాలు వ్యక్తం అయ్యేవి. మొదట్లో నా క్యారెక్టర్ ని మార్చమని అడిగాను. కాని కథ డిమాండ్ ప్రకారం చేయాల్సి వచ్చింది. ముఖ్యంగాకథ నచ్చింది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు పూరి జగన్నాధ్ కు చెందుతుంది. నాలో నమ్మకాన్ని కలిగించారు. అందరు అభినందించే విధంగా పాత్రను తీర్చిదిద్దారు" అని చెప్పారు. నిజానికి ప్రి ప్రొడక్షన్ సమయంలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్స్ చేయటానికి ఏ మాత్రం ఇష్టపడలేదంట. అంతే కాకుండా రైటర్ వక్కంతం వంశీని సైతం కథని మార్చవలసిందిగా ఎన్టీఆర్ ఒత్తిడి తీసుకువచ్చినా,రైటర్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

మొత్తంగా టెంపర్ మూవీ రిలీజ్ వరకూ అనుమానంగా ఉన్న ఎన్టీఆర్, రిలీజ్ అనంతరం మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో తెగ సంతోష పడుతున్నాడు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకు వక్కంతం వంశి కథ అందించారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78996/Bandla-ganesh-tollywood-telugu-films-temper-poori-/

0 comments:

Post a Comment

 
Top