సూపర్ స్టార్ మహేష్ ఇప్పటి వరకు మూడు అక్షరాల సెంటిమెంట్ తో తన సినిమాలకు టైటిల్స్ పెట్టుకుంటూ వచ్చాడు. అయితే మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పెడుతున్నట్లుగా విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ వార్తల పై ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఎటువంటి ఖండన ఇవ్వక పోవడంతో ఈ టైటిల్ ఖాయం అనుకున్నారు అంతా.
అయితే ఇప్పుడు ‘శ్రీమంతుడు’, ‘జమిందారు’ గా మారబోతున్నాడు అంటూ ఫిలింనగర్ లో వార్తల హడావిడి మొదలైంది. దీనికి కారణం ‘శ్రీమంతుడు’ టైటిల్ అంత క్యాచీగా లేదనీ యూనిట్ అనుకోవడంతో లేటెస్ట్ గా ‘జమిందార్’ తెరపైకి వచ్చిందని టాక్. అదీకాకుండా ఈ మార్పుకు ఒక సెంటిమెంట్ ప్రభావితం చేసిందని టాక్.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘శ్రీమంతుడు’ అప్పట్లో చెప్పుకో దగ్గ విజయం సాధించలేదనే సెంటిమెంట్ ఈ టైటిల్ మార్పుకు కారణం అని అంటున్నారు. దీనితో ‘జమిందార్’ అనే టైటిల్ వెలుగులోకి వచ్చింది అని టాక్. దాదాపుగా దీన్ని ఫైనల్ చేయవచ్చని ఫిల్మ్‌నగర్ టాక్. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి జంటగా 1965లో ‘జమీందార్’ మూవీ వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టింది.
అదేవిధంగా నాలుగేళ్ల క్రితం నాని హీరోగా వచ్చిన ‘పిల్ల జమీందార్’ కూడా కలెక్షన్లు రాబట్టింది. ఈ రెండు కారణాలు దర్శకుడు కొరటాల శివను, నిర్మాతలను ప్రభావితం చేయడంతో యూనిట్ అంతా ‘జమిందార్’ కు ఫిక్స్ అయ్యారని టాక్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మహాశివరాత్రి రోజున విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ లోపు ఈ సినిమా టైటిల్ విషయంలో ఇంకా ఎన్ని మార్పులు జరుగుతాయో చూడాలి.

0 comments:
Post a Comment