Menu

thamanna-marriage

మిల్కీ బ్యూటీ తమన్నా తన పెళ్ళి గురించి ఈమధ్య వినపడుతున్న వార్తల పై స్పష్టత ఇచ్చింది. ఈమధ్య కాలంలో తమన్నా తల్లితండ్రులు ఆమెకు ఒక మంచి పెళ్ళి కొడుకును వెతుకు తున్నారు అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపధ్యంలో నిన్న నెల్లూరులోని ఒక మొబైల్ షో రూమ్ ను ప్రారంభించడానికి వచ్చిన తమన్నా మీడియాతో మాట్లాడుతూ పెళ్ళి విషయమై తన గుట్టు విప్పింది.

ప్రస్తుతం తనకు పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదని కాని సందర్భం వచ్చినప్పుడు తాను ఈ విషయాన్ని బహిరంగంగానే చెపుతానని కొందరిలా పెళ్ళి విషయంలో రహస్యాలు పాటించ వలసిన అవసరం లేదని కామెంట్స్ చేసింది. అంతేకాదు కెరియర్ లో ఏ హీరోయిన్ అయినా 30 సంవత్సరాలు దాటిన తరువాతే పెళ్ళి గురించి ఆలోచిస్తారు అని అంటూ తాను ఇంకా యంగ్ హీరోయిన్ అనే సంకేతాలు ఇచ్చింది.

తన పెళ్ళి విషయంలో మటుకు తన కుటుంబం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను అంటూ తాను ఎవ్వరినీ ప్రేమించడంలేదు అన్న విషయాన్ని తెలివిగా చెప్పింది. నెల్లూరు వంటకాలు అంటే తనకు ఎంతో ఇష్టమని చెపుతూ ఈసారి తాను నెల్లూరులో తనకు నచ్చిన నెల్లూరు వంటలను తిని మరీ వెళతానని చెప్పుకొచ్చింది తమన్నా.

త్వరలో విడుదల కాబోతున్న ‘బాహుబలి’ విజయం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమన్నాకు ఈ సంవత్సరం తెలుగులో విడుదల కాబోతున్న సినిమాల విజయం పై తమన్నా టాలీవుడ్ కెరియర్ ఆధారపడి ఉంది అన్న విషయం వాస్తవం.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77698/TAMANNAH-MARRAIGE-PLAN-DISCLOSED/

0 comments:

Post a Comment

 
Top