చిరంజీవి మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ నటించిన తొలి సినిమా ‘రేయ్’ విడుదల కాకుండానే తన రెండవ సినిమాతో సక్సస్ అందుకుని తనకంటూ ఒక క్రేజ్ ఏర్పరుచుకున్నాడు ఈ మెగా కుటుంబ హీరో. అయితే సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిపోయినా ఆర్ధిక సమస్యలు వల్ల ఈసినిమా విడుదల కాకుండానే ఉండిపోయింది.
ఈ నేపధ్యంలో నందమూరి కుటుంబానికి వీరాభిమాని అయిన ఈ సినిమా నిర్మాత వైవిఎస్ చౌదరి గతనెల ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎన్టీఆర్ ఘాట్ వద్ద ‘రేయ్’ విడుదల కోసం ప్రార్ధనలు చేసాననీ తాను నమ్మిన దైవం ఎన్టీఆర్ ఆశిస్సులతో త్వరలోనే ‘రేయ్’ విడుదల అవుతుందని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
ఇప్పుడు నిర్మాత చౌదరి మరో ట్విస్ట్ ఇస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని సమస్యలు తీరిపోయాయని చెప్పడమే కాకుండా ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయబోతున్నట్లు చెపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తేదీకి కూడా ‘రేయ్’ విడుదల కావడం కష్టంలాగే కనిపిస్తోంది.
దీనికి కారణం ఇదే మార్చి 27ను టార్గెట్ చేసుకుని విడుదల అవ్వడానికి అన్నివిధాలా బాలకృష్ణ ‘లయన్’ సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో నందమూరి కుటుంబాన్ని విపరీతంగా ఆరాధించే వైవిఎస్ చౌదరి తన ‘రేయ్’ ని ‘లయన్’ తో పోటీకి దించే సాహసం చేయగలడా అన్న మాటలు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి.

0 comments:
Post a Comment