Menu

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హాట్ భామ శ్రుతి హాసన్ సౌత్‌లో సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.

ప్రస్తుతం మహేష్‌బాబు సరసన నటిస్తున్న ఈ భామ తాజాగా ఓ క్రేజీ అవకాశాన్ని కొట్టేసింది. వివరాల్లోకి వెళితే, హీరోయిన్ గా నటిస్తున్న శ్రుతి హాసన్ ఫిల్మ్ కెరీర్ పెరుగుతూనే వస్తుంది. తను చేసిన తక్కువ సినిమాలతో టాప్ స్టార్ డంని పొందిన హీరోయిన్స్ లో శ్రుతి హాసన్ మొదటి స్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. పూజై చిత్రంతో తమిళంలో హిట్ ఖాతాను తెరచిన శ్రుతి హాసన్, ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ పులి చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు.

అలాగే, ప్రముఖ తమిళ స్టార్‌హీరో అజిత్ హీరోగా ‘వీరం’ ఫేమ్ శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో హీరోయిన్‌గా చేయనుందట. ఇప్పటికే హీరోయిన్ పాత్రకోసం పలువురి పేర్లు వినిపించినప్పటికి చివరగా శృతిహాసన్ ని ఓకే చేసినట్లు సమాచారం. ఇందులో తనకి ఆఫర్ రావటానికి కారణం గతంలో శృతిహాసన్,

అజిత్ ని హీరోయిన్ గా ఛాన్స్ అడిగిందట. అయితే ఇది జరిగి చాలా తక్కువ రోజులే అయిందట. ఇంతలో శృతిహాసన్ మాటను గుర్తుంచుకొని, తనకి హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చినందుకు, అజిత్ కి శృతిహాసన్ ఫోన్ చేసి మరీ థ్యాంక్స్ చెప్పుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79273/Sruthi-haasan-akshara-haasan-tollywood-kollywood-b/

0 comments:

Post a Comment

 
Top