నందమూరి నటసింహం బాలక్రిష్ణ ఫిల్మ్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం తను నటిస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఫిల్మ్ ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ అవుతుంది. అంతే కాకుండా ఫ్యాన్స్ సైతం బాలక్రిష్ణ నటిస్తున్న మూవీలను చూడటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం నట సింహం నందమూరి బాలకృష్ణ ‘లయన్’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ శివార్లలో జరుగుతోంది.
ఇటీవలే మొయినాబాద్ లో బాలకృష్ణపై ఓ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసారు. న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ టీజర్ రూపంలో నందమూరి బాలకృష్ణ తన ‘లయన్’ సినిమా ఎలా ఉంటుందా అనేది అభిమానులకు కాస్త సాంపిల్ చూపించాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దాంతో ఈ సినిమా ఆడియో కూడా రిలీజ్ కాకముందే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ వారు సొంతం చేసుకున్నారు. అది కూడా ఓ భారీ మొత్తానికి తీసుకున్నట్లు సమాచారం.
అలాగే, లయన్ మూవీకి సంబంధించిన ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లోనూ లయన్ దూకుడు చూపుతుంది. పలువురు నిర్మాతలు, బడా డిస్ట్రిబ్యూటర్స్ బాలక్రిష్ణ నటిస్తున్న లయన్ మూవీ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. బాలక్రిష్ణ పొలిటికల్ రంగంలో ఉండటంతో, కొందరు రాజకీయ నాయకులే స్వయంగా లయన్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారనే టాక్స్ క్లియర్ గా వినిపిస్తున్నాయి.
మొత్తంగా లయన్ మూవీకి సంబంధించిన ఏరియా రైట్స్ కి ఇప్పుడు ఫుల్ డిమాండ్ పెరిగింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిషతో పాటు రాధిక ఆప్టే కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.
source:http://www.apherald.com/Movies/ViewArticle/80343/Balakrishna-ntr-tollywood-balayya-film-simha-lion-/

0 comments:
Post a Comment