సమంతా, సిద్దార్థలు ‘బెంగుళూరు డేస్’ సినిమా రీమేక్ నుండి తప్పుకున్న తరవాత ఈ సినిమాకు మొదటిగా అనుకున్న నటీనటుల ఎంపికలో చాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాతలు ప్రసాద్.వి.పోట్లూరి, దిల్ రాజు సంయుక్తంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈసినిమా స్క్రిప్ట్ కు సంబంధించి మన తెలుగు నేటివిటీ ప్రకారం చాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.
అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు తెలుగులో ‘హైదరాబాద్ డేస్’ అని, తమిళంలో ‘చెన్నై డేస్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు అని టాక్. అయితే ముందుగా అనుకున్నట్లు కాకుండా ఈ సినిమాలో నాగ చైతన్యకు బదులు రానా ఎంపిక అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. రానా, ఆర్య, నిత్యామీనన్, శ్రీదివ్యలు ప్రధాన పాత్రలలో నటించబోతున్నట్లు టాక్.
దీనికి కారణం ఈ నలుగురుకీ టాలీవుడ్ తో పాటుగా కోలీవుడ్ లో కూడ క్రేజ్ ఉండటంతో చైతన్యకు బదులుగా రానాను తీసుకోవడం జరిగింది అని అంటున్నారు. అదీకాకుండా చైతన్య బాడీ లాంగ్వేజ్ కంటే రానా బాడీ లాంగ్వేజ్ చాల పవర్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఈ సినిమాలోని క్యారెక్టర్ కు అన్ని విధాల చైతూ కన్నా రానా బాగుంటాడు అన్న భావనతో ఈ మార్పు చేసారు అని ఫిలింనగర్ టాక్.
త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుంది అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా చైతూకు రానా ఇచ్చిన అనుకోని ట్విస్ట్ అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79297/CHAITANYA-GOT-SHOCKED-WITH-RANA/

0 comments:
Post a Comment