Menu

రకుల్ ప్రీత్ స్పీడ్ తో టాలీవుడ్ అదిరి పోతోంది. సమంత, కాజల్, తమన్నాలకు టాలీవుడ్ లో త్వరలో చెక్ పడనుందా అనేడట్లుగా రకుల్ క్రేజ్ టాలీవుడ్ ను కుదిపేస్తోంది. జూనియర్ తో రకుల్ ప్రీత్ రొమాన్స్ చేయడం ఖాయం అవడంతో రామ్ చరణ్, మహేష్ లతో కూడా రకుల్ నటించబోయే సినిమాలు త్వరలోనే ఉన్నాయి అంటూ వార్తల హడావిడి మొదలైంది.

ఈ వార్తలు ఇలా ఉండగా రకుల్ మీడియాను కూడా చాల చక్కగా మేనజ్ చేస్తూ ఫంక్షన్స్ లో గ్లామరస్ గా కనిపిస్తూ వరస పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపధ్యంలో యాంకర్ ప్రదీప్ నిర్వహిస్తున్న ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ కార్యక్రమంలో అతి త్వరలో సందడి చేయబోతోంది రకుల్.

ఈ కార్యక్రమానికి చాల గ్లామరస్ గా రెడీ అయి రకుల్ రావడమే కాకుండా ఏకంగా మహేష్ మాటలను అనుకరిస్తూ రకుల్ డైలాగ్స్ చెప్పింది అని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో యాంకర్ ప్రదీప్ నీకు నచ్చిన హీరో డైలాగ్ చెప్పమని అడిగినప్పుడు రకుల్ చెప్పిన సమాధానం ఆమె తెలివితేటలను చాటుతోంది.

ప్రిన్స్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ ‘పోకిరి’ సినిమాలోని ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు’ అన్న పంచ్ డైలాగ్ ను చెప్పడం బట్టి మహేష్ ను కూడా ఆకట్టుకోవడానికి రకుల్ చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ప్రయత్నం మహేష్ కు చేరిందో లేదో చూడాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79403/RAKUL-PREETH-FOLLOWING-MAHESH-DAILOGUES/

0 comments:

Post a Comment

 
Top