కాజల్ అగర్వాల్, ఈ పేరు వింటేనే కుర్రాళ్ళ గుండెల్లో 100 వాట్ల విద్యుత్ ప్రవహిస్తుంది. మరి అలా ఉంటాయి మన కాజల్ ఒంపు సొంపులు, ఎల్లోరా శిల్పానికి ఏ మాత్రం తీసిపోని ఆ ఎత్తు పల్లాలు. ఇప్పుడే పాల సముద్రంలో జలకాలాడి వొచ్చినట్లుండే ఆ రంగు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో. కాని ఇప్పుడు ఈ అందాల రాక్షసి మననుంచి దూరంకానుంది.. అదే పెళ్ళి చేసుకోబోతోందట. కాజల్ అగర్వాల్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని ఆలోచిస్తుందని సమాచారం. సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకుని లైఫులో సెటిల్ అవుదామని కాజల్ డిసైడ్ అయ్యిందట. అయితే ఈ మిత్రవింద మనువాడబోయే వ్యక్తి ఎవరా అన్న దాని మీద ఇప్పుడు రకరకాల వార్తలు మొదలయ్యాయి. అమ్మడు ముంబైకి చెందిన ఓ వజ్రాల వ్యాపారిని అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.
ఆ మధ్య ఫారిన్ లో ఒక వ్యక్తితో కలిసి కాజల్ చెట్టాపట్టాలేసుకొని తిరిగేసిన ఫోటోలు బయటకు వచ్చాయి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తినే కాజల్ వివాహం చేసుకోబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ వీళ్ళు ఇంట్లో పెద్దలతో కలిసి పెళ్లి మీద చర్చలు జరిపి ఓ అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక కాజల్ త్వరలో చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ తనను పెళ్లి చేసుకోబోయే ఈ వజ్రాల వ్యాపారి గురించే అని చర్చ మొదలయ్యింది.
0 comments:
Post a Comment