టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం పై ఈమధ్య జరుగుతున్న నెగిటివ్ ప్రచారం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. గత మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా హాస్యానికి మకుటం లేని మహారాజులా వెలుగుతున్న బ్రహ్మి కామెడీ కొంత వరకు రొటీన్ గా మారిపోతోంది అని కామెంట్స్ వస్తున్నా అది బ్రహ్మానందం పాత్ర డిజైనింగ్ లో రచియితలు, దర్శకులు చేస్తున్న పొరపాటు అని అనుకోవాలి కాని బ్రహ్మానందం నటనలో పస తగ్గింది అనుకుంటే అది పొరపాటు.
ఇప్పటికీ బహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. గత సంవత్సరం 2014లో బ్రహ్మి19 సినిమాల వరకు చేసాడు ఆ సినిమాలలో కొన్ని సూపర్ హిట్స్ కుడా ఉన్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం విడుదల అయిన ‘రేసు గుర్రం’ సూపర్ హిట్ లో బ్రహ్మి కామెడీ ఎంతో ప్రభావాన్ని చూపింది అన్న మాట వాస్తవం.
కానీ ఇటీవల విడుదల అవుతున్న చాల సినిమాల్లో బ్రహ్మానందం కనిపించక పోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. గత మూడు నెలలుగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలలో బ్రహ్మి నటించిన ఒక్క సినిమా కూడా లేకపోవడం షాకింగ్ గా మారింది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం బ్రహ్మానందం నాగచైతన్యతో నటించిన ‘దోచేయ్’ సినిమాలో మాత్రమే వచ్చే నెలలో కనిపిస్తాడని టాక్.
ఈ సినిమా తప్పిoచి మరే భారీ సినిమాలో కూడ బ్రహ్మి వచ్చే నెలలో కూడా బ్రహ్మి కనిపించే అవకాశాలు లేవు అని టాక్. అయితే బ్రహ్మి మాత్రం కాల్ షీట్స్ సద్దుబాటు చేయలేక సినిమాలను వదులుకుంటున్నాను అని అంటున్నాడు. ఏది ఎలా ఉన్నా ఇలా హఠాత్తుగా బ్రహ్మీ లేకుండా భారీ సినిమాలు రావడానికి బ్రహ్మి కాస్ట్లీ కమెడియన్ గా మరిపోవడమా? లేకుంటే బ్రహ్మి నటన టాలీవుడ్ కు బోర్ కొట్టిందా? అన్న విషయం పై రానున్న రోజులలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79407/NEGATIVE-PROPAGANDA-ON-BRAHMANANDAM-/

0 comments:
Post a Comment