హైదరాబాద్: మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘పిల్లా నువ్వు లేని జీవితం' ఆడియో ఈ రోజు సాయంత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆడియో వేడుక చిరంజీవి చేతుల మీదుగా జరుగబోతోంది. పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీ హీరోలంతా హాజరవుతున్నారు. అయితే పవర్ స్టార్ గైర్హాజరుపై అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందిస్తూ...పవన్ రాకున్నా, ఆయన ఆశీస్సులు వచ్చాయని తెలిపారు. డు సాయి ధరమ్ తేజ్ హీరోగా, రెజినా హీరోయిన్ గా మెగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్ఠలు గీతా ఆర్ట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం. బన్ని వాసు, శ్రీ హర్షిత్‌లు నిర్మాతలు, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
రవికుమార్ చౌదరి దర్శకుడు..ఈ ఆడియోని అక్టొబర్ 25న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మెగా అభిమానుల సమక్షంలొ విడుదల చేనున్నారు. డిజిటల్ లాంచ్ లో భాగంగా రెడియో మిర్చి స్టేషన్ లో మెగా ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రానికి సంబందించి టైటిల్ సాంగ్ ని ఇటీవల విడుదల చేశారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రఘు బాబు, దువ్వాసి మోహన్, రాజిత, సత్య కృష్ణ, సురేఖ వాణి తదితరులు నటిస్తున్న చిత్రానికి, మాటలు : డైమండ్ రత్నం , పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి , చంద్రబోస్, అశోక్ తేజ్, శ్రీమణి, సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరా : దాశరధి శివేంద్ర , ఆర్ట్ : రమణ వంక, ఎడిటింగ్ : గౌతంరాజు, ex- ప్రొడ్యూసర్ : సత్య, నిర్మాతలు : బన్నీ వాసు, శ్రీ హర్షిత్, కథ-స్క్రీన్ప్లే -మాటలు-దర్శకత్వం : ఏ.ఎస్ .రవి కుమార్ చౌదరి.
0 comments:
Post a Comment