నందమూరి తారకరామారావు కన్నా జూనియర్ గొప్పవాడు అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే సృస్టిస్తున్నాయి. ఈ మాటలు తెలుగు దేశం కేడర్ కు విపరీతమైన కోపాన్ని తెప్పిoచడమే కాకుండా వర్మకు ఎటువంటి గట్టి సమాధానం ఇవ్వాలి అని ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు ఇలా ఉండగా ‘టెంపర్’ పై వర్మ చేసిన వ్యాఖ్యల పై పవన్ సినిమా సెంటిమెంట్ వెంటాడుతోంది అని జూనియర్ అభిమానులు భయ భయపడుతున్నట్లు టాక్. 2012 సంవత్సరంలో వర్మ పవన్ నటించిన ‘కెమెరా మేన్ గంగతో రాంబాబు’ విడుదలకు ముందు వర్మ తన ట్విటర్ లో స్పందిస్తూ ‘ఇప్పుడే పవన్ పవన్ సినిమా లోని సీన్స్ ను చూసాను పవన్ కళ్యాణ్ చాల పవర్ ఫుల్ గా సెక్సీగా కనిపిస్తున్నాడు.ఇక తమన్నా అయితే జస్ట్ సెక్సీ’ అంటూ ట్విట్ చేసి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది అంటూ జోస్యం చెప్పాడు.
అయితే పవన్ నటించిన ఆ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. ఇప్పుడు మళ్ళీ వర్మ జూనియర్ పై ప్రశంసలు కురిపిస్తున్న నేపధ్యంలో ఆనాడు పవన్ ‘కెమెరా మేన్ గంగతో రాంబాబు’ సినిమాకు వచ్చిన పరిస్థితి తిరిగి ‘టెంపర్’ విషయంలో కూ
వర్మ ఏమి అనుకుని ఈ వ్యాఖ్యలు చేసాడో తెలియక పోయినా వర్మ వ్యాఖ్యలు అటు తెలుగు దేశం శ్రేణులకు ఇటు జూనియర్ అభిమానులకు తలనొప్పిగా మారాయి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78454/PAVAN-SENTIMENT-HAUNTING-TEMPER/

0 comments:
Post a Comment