Menu



ప్రభాస్ బాలీవుడ్ పై పెట్టుకున్న గంపెడు ఆశలు నీరుగారి పోయాయి అని జాతీయమీడియా కథనాలు రాస్తోంది. ప్రభాస్ కు అత్యంత సన్నిహితుడైన ప్రభుదేవా ప్రభాస్ తో బాలీవుడ్ లో చేసిన ప్రయోగం వికటించడం ప్రభాస్ కు తీరని అవమానంగా మారింది అని ఆ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక ఆ శక్తికర కథనాన్ని ప్రచురించింది.

ప్రభుదేవా అజయ్ దేవగన్ సోనాక్షి సిన్హాలను జంటగా కలిపి నిర్మించిన ‘యాక్షన్ జాక్సన్’ సినిమాలో వచ్చే ఒక పాటలో ఒక్క నిముషం పాటు ప్రభాస్ సోనాక్షి సిన్హా తో కలిసి స్టెప్పులు వేసాడు. అయితే ఈసినిమా ఘోరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకావడంతో ఈసినిమాను చూసే ప్రేక్షకులే కరువైపోయి అతి తక్కువ రోజులలోనే ఈసినిమాను ఉత్తరాది ప్రాంత ధియేటర్లలో తీసివేసారు.

ఈసినిమా అజయ్ దేవగన్ కెరియర్ లోనే భయంకరమైన ఫ్లాప్ గా మిగిలి పోయింది. అయితే ఇటువంటి ఫ్లాప్ సినిమాలో ఒక్క నిముషం పాటు ప్రభాస్ తళుక్ మణి మెరిసినా ప్రభాస్ ను బాలీవుడ్ ప్రేక్షకులు గుర్తించలేదు సరికదా డాన్స్ చేస్తున్న ప్రభాస్ ను చూసి ఎవరో డాన్సర్ అని అనుకున్నారట

‘బాహుబలి’ హిందీలో కూడా డబ్ కాబోతున్న నేపధ్యంలో ప్రభాస్ కు బాలీవుడ్ లో క్రేజ్ క్రియేట్ చేద్దామని ప్రభుదేవా ఎంతో వ్యూహాత్మకంగా తన ‘యాక్షన్ జాక్సన్’ లో వేసిన ఎత్తు విఫలం అవడమే కాకుండా కనీసం రానాను గుర్తించిన స్థాయిలో ప్రభాస్ ను గుర్తించక పోవడం అటు ప్రభాస్ తో పాటు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రభుదేవాకు షాకింగ్ గా మారింది అని కామెంట్లు రాయడమే కాకుండా ఈ ప్రభావం ప్రభాస్ ‘బాహుబలి’ హిందీ డబ్బింగ్ పై ఎటువంటి ప్రభావం చూపెడుతుందో అంటూ ఆ పత్రిక కామెంట్లు విసిరింది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/76747/BOLLYWOOD-SHOCK-TO-PRABHAS-/

0 comments:

Post a Comment

 
Top