Menu


సినిమా రంగంలో టాప్ హీరోలుగా వెలుగొందుతూ అనేక వ్యాపారాలలో కూడా రాణిస్తున్న చిరంజీవి నాగార్జునలు నిర్వహిస్తున్న మాటివికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు మీడియా వార్తలలో హడావిడి చేస్తోంది. వస్తున్న వార్తల ప్రకారం మాటివి ఎంటర్‌టైన్మెంట్ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతున్న స్టార్ ఇండియా ఛానల్ తో సహభాగస్వామి కానుందని వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి ఒక కీలక ఒప్పందం ఈరోజు స్టార్ గ్రూప్ కు మాటివి యాజమాన్యానికి మధ్య కుదిరింది అనే వార్తలు వినపడుతున్నాయి. వినపడుతున్న వార్తల ప్రకారం మాటివిలోని కొన్ని వాటాలను స్టార్ గ్రూప్ కొనుగోలు చేసింది అని టాక్. ఈరోజు ఉదయం ఈ విషయానికి సంబంధించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాలను మీడియాకు వివరించిన సమావేశంలో నాగార్జున, చిరంజీవులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టార్ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటి వరకు తమకు తెలుగులో ప్రసారాలు లేవని, మాటీవీతో టై అప్ కారణంగా ఆ లోటు తీరుతోంది అని అన్నట్లుగా తెలుస్తోంది. వస్తున్న ఈ వార్తలను బట్టి మాటివి పేరుతో పాటు లోగోలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఛానల్స్ మధ్య విపరీతమైన పోటీ ఏర్పడి ఉండటంతో స్టార్ యాజమాన్యం కూడా చిరంజీవి, నాగార్జునలతో చేయి కలపడంతో మాటివి పేరు మారడమే కాకుండా ఆ టివిలో ప్రసారమయ్యే కార్యక్రమాలలో కూడా భవిష్యత్ లో అనేక మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78486/CHIRU-NAG-BUSINESS-STRATEGY-BECOMING-SCHOCKING/

0 comments:

Post a Comment

 
Top