చిరంజీవి 150 వ సినిమా గురించి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టుగాపెట్టి.. రాజకీయాల వైపు వెళ్లిన మెగాస్టార్ అవి అంత గిట్టుబాటుగా లేకపోవడంతో తిరిగి సినిమాల వైపు వచ్చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ చిరంజీవికి వెల్కమ్ అంటోంది.
ఇదిలా ఉంటే..ఇప్పుడు ఈ సినిమాలో తనకూ ఛాన్స్ ఇస్తే బావుంటుందని అంటున్నాడు ఆనం వివేకానందరెడ్డి. ప్రస్తుతానికి ఈయనను కాంగ్రెస్ నేతే అనుకోవాలి. మొన్నటి ఎన్నికల తర్వాత మిన్నకుండిపోయిన వివేకానందరెడ్డి కి సినిమాల మీద చాలా ఆసక్తే ఉంది. అధికారంలో ఉన్న రోజుల్లో నెల్లూరుకు ఎవరైనా సినిమా వచ్చినా అక్కడ ఆనం ప్రత్యక్షం అయ్యేవాడు.
సినిమా వాళ్లతో సన్నిహితంగా కనిపించి తన ముచ్చట తీర్చుకొనే వాడు. ఈ నేపథ్యంలో డైరెక్టుగా సినిమాల్లో నటించడం పట్ల కూడా వివేకానందరెడ్డి ఆసక్తి పుట్టినట్టుగా ఉంది. ఏకంగా ఎన్నో అంచనాలున్న చిరంజీవి సినిమాలో తనకు అవకాశం వస్తే బావుంటుందని అంటున్నాడీయన.
మరి ఈ రెడ్డిగారి ముచ్చటను మెగాస్టార్ తీరుస్తాడేమో చూడాలి. అయినా చిరంజీవికే 150 వ సినిమా మీద పూర్తిగా క్లారిటీ లేదు. దాదాపు ఏడాది రెండేళ్ల నుంచి ఈ వ్యవహారంపై ఏవో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దానికంతా ఒక క్లారిటీ వస్తే గానీ.. ఆనంకు ఛాన్సు ఉందా..లేదా.. అనే అంశం పై క్లారిటీ ఉండదేమో!
source:http://www.apherald.com/Politics/ViewArticle/77478/chiranjeevi-congress-movies-tollywood-ap-politics-/
0 comments:
Post a Comment