Menu


అల్లుఅర్జున్ లేటెస్ట్ సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాను ఏప్రియల్ మొదటి వారంలో విడుదల చేయడానికి ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా బాలకృష్ణ ‘లయన్’, ప్రభాస్ ‘బాహుబలి’ విడుదల తేదీల మధ్య చిక్కుకుని నలిగిపోతూ ఉంటే అల్లుఅర్జున్ కు మరో కొత్త సమస్య ఎదురైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీనికి కారణం కమలహాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ సినిమాను కూడా ఏప్రియల్ 2వ తారీఖున విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్నో భారీ అంచనాలతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్‌ తెయ్యమ్‌ కళాకారుడిగా, నటుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

బాలచందర్‌ నటించిన చివరిచిత్రం అవడంతో ఈ చిత్రం ఆయనకు అంకితం ఇస్తున్నారు. ఈ సినిమాలో కమల్ తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి ఎక్కువగా కష్టపడ్డాడు. ఆ పాత్రకు మేకప్‌ వేసుకోవడానికి దాదాపు నాలుగు గంటలు పట్టేది అని టాక్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిన నేపధ్యంలో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పుడు ఈ సినిమా కూడా ఏప్రియల్ మొదటి వారాన్ని టార్గెట్ చేస్తూ ఉండటంతో బన్నీ సత్యమూర్తికి సమస్యలు మరింత పెరిగాయనే అనుకోవాలి.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78463/KAMALAHASAN-TARUCHER-TO-BANNY-/

0 comments:

Post a Comment

 
Top