Menu

ప్రస్తుతం టెంపర్ సక్సెస్ తో మంచి దూకుడు మీద ఉన్న జూనియర ఎన్టీఆర్, తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు. టెంపర్ సక్సెస్ తరువాత, జూనియర్ చేయబోతున్న ప్రాజెక్ట్ పై హ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. వైవిధ్యభరిత సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలాఖరు నుండి ప్రారంభమవుతుంది. ఇందుకోసం జూనియర్ కసరత్తులు చేస్తున్నాడు. ఇక కథ విషయానికి వస్తే, ఈ మూవీ కథ చాలా స్టైలిష్ గా ఉండబోతుంది.

దాదాపు యూకే నేపథ్యంలో కథ ఉంటుందని సమాచారం. అందుకే మేజర్ పార్ట్ షూటింగ్ సైతం అక్కడే జరుపుతారని ఫిల్మ్ నగర్ టాక్. ఎన్టీఆర్ ఈ తరహా కథలో నటించడం కూడ ఇదే మొదటిసారి అని సుకుమార్ చెప్పుకొస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు గా పనిచేస్తున్నాడు. అయితే నిర్మాతలు సైతం జూనియర్-సుకుమార్ ల చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించటానికి సిద్ధంగా ఉన్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79464/Ntr-sukumar-tollywood-rakhul-preeth-sings-ntr-film/

0 comments:

Post a Comment

 
Top