మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దూకుడు నిర్ణయాలు చరణ్ లేటెస్ట్ గా శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సమస్యలుగా మారుతున్నాయని ఫిలింనగర్ లో వార్తల హడావిడి వినిపిస్తోంది. ఈ సినిమాను మొదట్లో 40 కోట్ల బడ్జెట్ తో నిర్మిద్దామని ఈసినిమా నిర్మాతలు బావిoచారని టాక్. అయితే రామ్ చరణ్ ఈ సినిమా సంగీత దర్శకుడిగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ద్ కావాలని పట్టుపట్టడంతో ఆ మ్యూజిక్ డైరెక్టర్ కు ఏకంగా 2.50 కోట్లు పారితోషికంగా ఇవ్వవలసి వస్తోందని టాక్.
అదేవిధంగా ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా స్క్రిప్ట్ కోన వెంకట్, గోపీ మోహన్ లు శ్రీను వైట్లతో కలిసి రచించాలి అని పట్టుపట్టడంతో వీరిద్దరికీ కూడా చెరొక కోటి రూపాయలు పారితోషికంగా ఇవ్వవలసి రావడంతో అన్ని ఖర్చులు కలుపుకుని ఈసినిమా బడ్జెట్ 50 కోట్లకు చేరిపోతోందని ఈసినిమాను నిర్మిస్తున్న దానయ్య గగ్గోలు పెడుతున్నట్లు ఫిలింనగర్ లో గాసిప్పులు వినపడుతున్నాయి.
రామ్ చరణ్ గతసంవత్సరం నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విషయంలో బయ్యర్లు ఘోరంగా దెబ్బతిన్న నేపధ్యంలో ఇలా చరణ్ తన లేటెస్ట్ సినిమాకు బడ్జెట్ ను పెంచుతూ పోతూ ఉంటే ఈసినిమా మార్కెట్ చేయడం ఎలా అని ఈ సినిమా నిర్మాతలు టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముందుగా ఈసినిమాకు సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ పేరు అనుకున్నా చరణ్ కు అనూప్ కంటే అనిరుద్ద్ పై మోజు పెరగడంతో పాటు ఇలా ప్రతి విషయంలోనూ చరణ్ కలగచేసుకుంటూ పోతే సినిమాలు ఎలాతీయాలి అని చరణ్ తో సినిమాలు తీయబోతున్న నిర్మాతలు భయపడి పోతున్నారని టాక్. ఒక వైపు పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో బడ్జెట్ ను తగ్గిస్తుంటే చరణ్ మాత్రం తన సినిమాలకు బడ్జెట్ ను పెoచేస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78479/CHARAN-MOVIES-OVER-BUDGET-BECOMING-TENSION/

0 comments:
Post a Comment