బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయం పై హడావిడి చేస్తూనే ఉంటుంది. ప్రియాంక చోప్రా చేల్లెలుగానే కాకుండా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచు కోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు బాలీవుడ్ మీడియాకు ఎప్పుడూ హాట్ టాపిక్.
ఈ పరిస్థుతుల నేపధ్యంలో ప్రస్తుతం యువతరంలో ఉన్న సెక్స్ కోరికలను ఎలా అదుపులో పెట్టుకోవాలి అన్న విషయం పై బహిరంగంగా మీడియా ద్వారా పాఠాలు చెపుతోంది ఈ హాట్ బ్యూటీ. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వయసులో ఉన్నపుడు సెక్స్ కోరికలు ఉండటం సహజమే అని అంటూ ముఖ్యంగా యువతలో కోరికలు తారా స్థాయిలో ఉంటాయి అని పేర్కొంటూ ఆ వయస్సులో సెక్స్ గురించి ఆలోచించడం తప్పులేదు అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రణీతి చోప్రా.
అయితే ఇటువంటి కోరికల పై ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే కెరియర్ లో యూత్ ఎదగాలేరని అంటూ తనకు కూడా అలాంటి కోరికలు ఉన్నాయి అని చెపుతూ యోగా, మెడిటేషన్ లాంటి వాటి ద్వారా తను తన కోరికలను కంట్రోల్ లో చేసుకుంతున్నానని మరీ ఎక్కువగా ఈ కోర్కెల సమస్య పెరిగిపోయినప్పుడు చన్నీటితో స్నానం చేస్తే సరిపోతుందని యూత్ కు సలహాలు ఇస్తోంది ప్రణితి.
బాలీవుడ్ లో దాదాపు అరడజను సినిమాలు చేసినా గుర్తింపు రాకపోవడంతో ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చి ఇలా సెక్స్ యోగా గురువుగా ప్రణీతి మారిపోతోంది అని అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78943/BOLLYWOOD-HEROINE-SENSATIONAL-COMMENTS-ON-SEX/
0 comments:
Post a Comment