నట సామ్రాట్, స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి బాపు అంటే ఎనలేని అభిమానం. తన ఆప్త మిత్రుడు ముళ్ళపూడి వెంకట రమణ రచయితగా వ్యవహరించిన అక్కినేని ‘మూగ మనసులు’ చిత్రానికి బాపు ఆర్టిస్టిక్ పోస్టర్ డిజైన్ చేశారు. ఆ సమయంలో ఏన్నార్ పుట్టినరోజు కానుకగా ఈ పెయింటింగ్ అందించారు.
పైన మీరు చూస్తున్న ఈ ఫోటో అంటే అక్కినేనికి ఎంతో ఇష్టమని నాగార్జున తెలిపారు. బాపు దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘శ్రీ రామ రాజ్యం’లో మహర్షి వాల్మీకి పాత్రలో అక్కినేని నటించారు. బాపు మనందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళినా.. దర్శకుడిగా, చిత్రకారుడిగా ఆయన అందించిన మధుర జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి.
0 comments:
Post a Comment