టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన పోటీ నడవనుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నందమూరి హీరోతో మెగాహీరో తలపడనున్నాడు. వివరాల్లోకి వెళితే, గత ఏడాది వేసవిలో వెంట వెంటనే రెండు భారీ విజయాలు అందించిన బాలయ్య, అల్లు అర్జున్.... ఈసారి కూడా వేసవి విజయాలు తమవేనంటూ దూసుకొస్తున్నారు.
బాలయ్య హీరోగా నటిస్తున్న 'లయన్' చిత్రం మార్చి 27న విడుదలకు రెడీ అవుతోంది.... నూతన దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. త్రిష, రాధికా ఆప్టే ఈ సినిమాలో బాలయ్యకు జంటగా నటిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా... ఏప్రిల్ మొదటివారంలో విడుదలకు ముస్తాబవుతోంది.
వారం తేడాతో వస్తున్న ఈ రెండు సినిమాలు సమ్మర్ ను టార్గెట్ చేశాయి. అయితే బాలక్రిష్ణ నటిస్తున్న అప్ కమింగ్ చిత్రం లయన్ రిలీజ్ వెంటనే, మూవీకి సంబంథించిన టాక్ విషయంలో ఏమైనా తేడా అనిపిస్తే, వెంటనే బన్నీ నటించిన మూవీని రిలీజ్ చేయటానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
అప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కావల్సిన బన్ని-త్రివిక్రమ్ ల మూవీ, మార్చి నెల చివరి రోజున రిలీజ్ అవుతుందని ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా లయన్ మూవీకి బాక్సాపీస్ వద్ద గట్టి పోటి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం బన్ని-త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం స్టార్ట్ చేయనున్నారు.
http://www.apherald.com/MOVIES/ViewArticle/77977/BUNNY-SUMMER-LION-TELUGU-FILMS-LION-NEWS-BUNNY-FIL/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.