దీనికి కారణం ఇప్పుడు అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈసినిమాను ఏప్రిల్ మొదటి వారంలో తీసుకు వచ్చే ఆలోచనలో ఈసినిమా నిర్మాతలు ఉన్నారు. ఈసినిమా విడుదలకు కేవలం ఒకవారంరోజుల ముందు మార్చి నెలాఖరులో బాలకృష్ణ ‘లయన్’ వస్తుoటే బన్నీ సినిమా విడుదల అయిన రెండు వారాల గ్యాప్ లో ప్రభాస్ ‘బాహుబలి’ విడుదల కాబోతోంది. దీనిని బట్టి రెండు భారీ సినిమాల మధ్య బన్నీ సినిమా చిక్కుకోబోతోంది అని అర్ధం అవుతోంది.
ఈ విషయం అల్లుఅర్జున్ కు పెద్ద టెన్షన్ గా మారింది అని అంటున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఈసినిమాకు జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ అని తెలుస్తోంది. గత సంవత్సరం అల్లుఅర్జున్ నటించిన ‘రేసుగుర్రం’ 60 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసి క్రితం సంవత్సరం విడుదలైన సినిమాలలో నెంబర్ వన్ స్థానంలో నిలవడంతో ఇప్పుడు అత్యంత భారీ మొత్తాలకు బన్నీ కొత్త సినిమాను కొనుక్కుం టున్న బయ్యర్లు లాభ పడాలి అంటే ఈ సినిమా ‘రేసు గుర్రం’ కలెక్షన్స్ ను దాటి ఎక్కువ వసూలు చేయాలి.
అప్పుడే బన్నీ స్టామినా రుజువు చేసుకుంటుంది. అయితే రెండు భారీ సినిమాల మధ్య చిక్కుకున్న ఈ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అటువంటి అద్భుతాన్ని సాధించ గలుగుతుందా అనే భయంతో పాటు కేవలం రెండువారాల తేడాతో వస్తున్న ‘బాహుబలి’ సునామి ముందు తన సత్యమూర్తి నిలబడ గలడా అనే టెన్షన్ లో ప్రస్తుతం బన్నీ ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77981/SATYAMURTHY-BECOMING-TENSION-TO-BANNY/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.