‘టెంపర్’ ఆడియో వేడుకలో జూనియర్ ఎన్టీర్ మాట్లాడిన తీరును పరిశీలించిన విశ్లేషకులు ఒక విషయాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. ‘గోపాల గోపాల’ ఆడియో వేడుకలో పవన్ మాటలకు ‘టెంపర్’ ఆడియో వేడుకలో జూనియర్ మాట్లాడిన మాటలకు పదాలు వేరైనా భావం ఒక్కటే అంటూ సరికొత్త విశ్లేషణలను చేస్తున్నారు.
గోపాల గోపాల’ ఆడియో వేడుకలో పవన్ మాట్లాడుతూ తన సినిమా ‘ఖుషీ’ విడుదల తరువాత వరస పెట్టి వచ్చిన పరాజయాలను చూసి తాను బాధ పడక పోయినా తన అభిమానులు పడుతున్న టెన్షన్ చూసి వారి కోసమైనా ఒక్క సూపర్ హిట్ సినిమా ఇవ్వమని భగవంతుడిని కోరుకున్నానని ఆ కోరికే ‘గబ్బర్ సింగ్’ గా మారి తన అభిమానుల బ్లాక్ బస్టర్ కోరికను తీర్చిందని బహిరంగంగా చెప్పి విజయాల కోసం హీరోలు ఏ విధంగా తపించి పోతారో వాస్తవాన్ని తెలియ చేసాడు పవన్.
అదే తీరును అనుసరిస్తూ ‘టెంపర్’ ఆడియో వేడుకలో కూడా జూనియర్ మాట్లాడుతూ తన సినిమాల జయాపజయాలను తాను పట్టించుకోక పోయినా తన అభిమానులు కోరుకునే బ్లాక్ బస్టర్ హిట్ వచ్చే వరకు నటిస్తూనే ఉంటాను అని చెపుతూ తన అభిమానుల కోరికను తీర్చమని భగవంతుడిని కోరుతున్నట్లుగా బహిరంగంగానే చెప్పాడు జూనియర్.
దీనిని బట్టి చూస్తూ ఉంటే గత రెండు సంవత్సరాలుగా జూనియర్ ను వెంటాడుతున్న పరాజయాల ప్రభావం యంగ్ టైగర్ ను ఏ విధంగా నిరాశ పరిచిందో అర్ధం అవుతుంది. సినిమాలలో భారీ డైలాగులు చెప్పే టాలీవుడ్ ఎంపరర్ అయినా యంగ్ టైగర్ అయినా పరాజయాల దాటికి ఏ విధంగా బెంబేలు పడిపోతారో వీరి మాటలే ఉదాహరణ.

0 comments:
Post a Comment