రజినీకాంత్.. ఈ పేరు ఒక సంచలనం.. రజినీకాంత్ పేరు చెబితే చాలు.. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది.. 60 ఏళ్ల వయసులోనూ క్రేజ్ తగ్గని హీరో.. ఎంత సూపర్ స్టార్ అయినా అన్ని సినిమాలు హిట్ కావాలని లేదుగా.. కానీ రజినీకాంత్ క్రేజే ఆయన డిస్టిబ్యూటర్లకు చేటు తెస్తోంది.

కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన లింగా చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేదు. ఈ చిత్రాన్నికొన్న పంపిణీదారులు తీవ్రంగా నష్ట పోయారు. సినిమా నిర్మాతలు పంపిణీదారులకు భారీ మొత్తానికి అమ్మారని... తాము ఈ చిత్రం ద్వారా తీవ్రంగా నష్టపోయామని పంపిణీ దారులు ఆరోపిస్తున్నారు. రజినీకాంత్ స్వయంగా జోక్యం చేసుకుని బాబా చిత్రం ద్వారా నష్టపోయిన పంపిణీ దారులకు నిర్మాతల నుంచి కొంత మొత్తం నష్టపరిహారంగా ఇప్పించారు. ఇప్పుడు కూడా తమకూ అలాగే న్యాయం చేయాలని కోరుతున్నారు.
లింగా పంపిణీదారులు ఇటీవల చెన్నైలో నిరాహార దీక్ష కూడా చేపట్టారు. రజినీకాంత్ జోక్యంతో పంపిణీదారులు నష్టపోయిన మొత్తంలో పదిశాతం తిరిగి ఇప్పించేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారు. ఐతే పంపిణీదారులు మాత్రం ఇందుకు సమ్మతించడం లేదు. నష్ట పరిహారం పెంచాల్సిందిగా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. అటు నిర్మాతలు, ఇటు హీరో రజినీకాంత్ నుంచి సానుకూల స్పందన ఏమాత్రం రావడం లేదట. అందుకే ఏకంగా రజినీ ఇంటి ముందు పంపిణీదారులు బిక్షాటన చేయాలని డిసైడయ్యారు. లింగా ప్రదర్శించిన ధియేటర్ల ముందు హుండీలు కూడా పెడతారట.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78781/LINGA-RAJINI-KANTH-DISTRIBUTERS-CHENNAI-BEGGING-BR/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.