Menu

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన సినిమాల విషయాలు తప్ప మరే విషయాలు పట్టించుకోడు. ఆఖరకు బయట జరిగే సినిమా ఫంక్షన్స్ కూడా చాల అరుదుగా వస్తూ ఉంటాడు. ఇక రాజకీయాల గురించి ఏనాడు స్పందించడు సరికదా ఎంత మంది ప్రశ్నించినా తనకు చాలామంది రాజకీయనాయకుల పేర్లు కూడా తెలియవు అంటూ తెలివిగా సమాధానం ఇస్తాడు. అటువంటి మహేష్ లోని మరొక యాంగిల్ కమెడియన్ అలీ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

సినిమాలలో నటించిన దానికన్నా యాడ్స్ లో నటించే విషయంలో మహేష్ ఇప్పటికే టాలీవుడ్ నెంబర్ వన్ గా మారిపోయాడు. ప్రతి సంవత్సరం అనేక ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం చేయడం ద్వారా మహేష్ కు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి మహేష్ ను ఇంత డబ్బు ఏమి చేసుకుంటావు అని జోక్ చేసాడట.

దానితో అసలు విషయం బయట పెట్టాడట మహేష్. తాను సంపాదిస్తున్న దానిలో 30 శాతం సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నాను ఇదంతా ఓల్డేజ్ హోమ్స్, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాను అంటూ మహేష్ చెప్పడమే కాకుండా దీనికి సంబంధించిన వ్యవహారాలను తన భార్య నమ్రత దగ్గరుండి పర్యవేక్షిస్తుందని షాకింగ్ న్యూస్ చెప్పాడట టాలీవుడ్ ప్రిన్స్.

ఈ విషయాలు అన్నీ అలీ ఇటీవల ప్రసారమైన ఓకార్యక్రమంలో స్వయంగా వెల్లడించాడు. మహేష్ అభిమానులు మాత్రం అలీ బయట పెట్టిన విషయానికి పొంగిపోతూ వెబ్ మీడియాలో తమ అభిమాన హీరోను పొగుడుతూ తెగ హడావిడి చేస్తున్నారు.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77440/ALI-DISCLOSED-MAHESH-UNKNOWN-SECRECTS/

0 comments:

Post a Comment

 
Top