అంతేకాదు సినిమా జయాపజయాలలో హీరోయిన్ పాత్ర చాల పరిమితంగా ఉంటుంది అని చెపుతూ గతంలో తాను పవన్ మహేష్ లతో నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ కావడం వెనుక తన పాత్ర కంటే ఆ హీరోల ఇమేజ్ ఆ సినిమాలను ఆ స్థాయిలో సూపర్ హిట్ చేశాయని ఆ సూపర్ హిట్ సినిమాలలో కూడ తన పాత్ర పరిమితం అని తేల్చి చెప్పింది సమంత. అంతేకాదు ‘లక్కీ గర్ల్,’ ‘గోల్డెన్ గర్ల్’ అనే ట్యాగ్ ల పై తనకు నమ్మకం లేదని అటువంటి బిరుదులూ తనకు మీడియా ఎందుకు తగిలిస్తుందో అర్ధం కాదని కామెంట్ చేసింది సమంత.
అదేవిధంగా అదృష్టం అనేది ఎవరి దగ్గరా శాస్వితంగా ఉండదని ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి జీవితాంతం అదృష్టవంతుడిగా కొనసాగాలి అనుకోవడం అవివేకం అని చెపుతోంది సమంత. తెలుగు సినిమా షూటింగ్ ల కోసం తాను భాగ్యనగరానికి వచ్చినప్పడు తానెప్పుడు తన తల్లినీ లేదా తండ్రిని తోడుగా తెచ్చుకోలేదని అయినా తనకు ఎటువంటి సమస్యలు టాలీవుడ్ లో ఎదరు కాలేదని చెపుతూ మన ప్రవర్తన బట్టి ఎదుటి వారు మనకిచ్చే గౌరవం ఉంటుంది అని అభిప్రాయపడుతోంది సమంత. ట్విస్ట్ ఏమిటంటే పవన్, మహేష్ ల వల్ల తన గత సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అని చెపుతున్న సమంత ‘రభస’ పరాజయం వెనుక తన పాత్ర కంటే జూనియర్ పాత్ర ఎక్కువ అని అర్ధం వచ్చేడట్లుగా ఈ మాయలేడి ఈ కామెంట్లు చేసింది అనుకోవాలి.
0 comments:
Post a Comment