Menu

ప్రకాష్ రాజ్ ను కూడా ప్రస్తుతం హైదరాబాద్ ను కుదిపేస్తున్న చలి వాతావరణం వదిలినట్లు లేదు. ఇంకా చలికాలం ఉదృతి పూర్తిగా తగ్గక పోవడంతో చాలామంది అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. దీనికి సినిమా సెలెబ్రెటీలు కూడ మినహాయింపు కాకపోవడంతో ప్రకాష్ రాజ్ తాను ఫ్లూ జ్వరంతో బాధ పడుతూ బెడ్ రెస్ట్‌లో ఉన్నాను అంటూ ట్వీట్ చేసాడు.హైదరాబాద్ లో పలు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రకాష్ రాజ్ తాను డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం 3 డేస్ రెస్ట్‌లో ఉన్నాను అంటూ ట్విట్ చేసాడు. ప్రకాష్ రాజ్ 'టెంపర్' ప్యాచ్ వర్క్ కోసం ఇక్కడే ఉన్నట్టు టాక్.

'టెంపర్'లో విలన్ రోల్, మణిరత్నం లేటెస్ట్ ప్రాజెక్ట్ ఓకే బంగారం, రుద్రమదేవి చిత్రాలతో మళ్ళీ తన రేంజ్ చుపెత్తబోతున్న ప్రకాష్ రాజ్ మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేయబోతున్న కొత్త సినిమాలో ఒక వెరైటీ రోల్ చేయబోతున్నాడని టాక్. ప్రకాష్ ఆరోగ్యం బాగుండక పోవడంతో ఈరోజు సాయంత్రం జరిగే జూనియర్ ‘టెంపర్’ ఆడియో వేడుకలో ప్రకాష్ రాజ్ హడావిడి ఉండదు.ఒక వైపు సినిమాలలో నటిస్తూ తిరిగి కన్నడ నాటకాలలో నటించడానికి ప్రకాష్ రాజ్ ఉత్సాహం చూపుతున్నాడు అంటే నాటకాల పట్ల ప్రకాష్ రాజ్ కు ఎంత ఇష్టమో అర్ధం అవుతుంది.


0 comments:

Post a Comment

 
Top