Menu

bahubali-1st-part
కేవలం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ భారీ చిత్రంగా రూపొందుతున్న, రాజమౌళి అప్ కమింగ్ ఫిల్మ్ బాహుబలి. ప్రస్తుతం బాహుబలి మూవీకి సంబంధించిన టాపిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకూ బాహుబలి మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న చాలా మంది, ఇక నుండి బాహుబలి మూవీ మొదటి పార్ట్ పై అంతగా ఆసక్తి చూపించనట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. ఈ మూవీ కథని ఒకే పార్ట్ లో చెప్పాలంటే, సాధ్యం కాని పని అంట. అందుకే రాజమౌళి రెండు భాగాలుగా దీనిని రిలీజ్ చేస్తున్నాడు. దీంతో కధని రక్తి కట్టించే సన్నివేశాలు అన్నింటికి రెండో పార్ట్ లోనే పొందుపరిచాడు. ఇక మొదటి పార్ట్ లో కేవలం టాకీ పార్ట్ మాత్రమే ఉంటుంది.

ఎటువంటి యాక్షన్ సన్నివేశాలు ఇందులో కనిపించవు. ఇదిలా ఉంటే తాజాగా బాహుబలి మొదటి పార్ట్ లో అనుష్క కనిపించదంటూ టాలీవుడ్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నయి. ఇంకా బాహుబలి మొదటి భాగం గురించి తెలుసుకుంటే, ఇందులో రానా కూడ చాలా తక్కువ సమయం కనిపిస్తాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. కేవలం ప్రభాస్, తమన్నలతోనే మొదటి భాగాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాడు రాజమౌళి.

ఇటువంటి విషయాలు బయటకు లీక్ కాడంతో చాలా మంది బాహుబలి మొదటి బాగం కంటే రెండో భాగాన్ని చూడటానికే ఆసక్తి చూపుతున్నారంట. బాహుబలి మొదటి భాగానికి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయితే కాని ఈ కన్ ఫ్యూజన్ తొలగదని కొందరు అంటున్నారు.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77469/BAAHUBALI-BAAHUBALI-1ST-PRAT-TOLLYWOOD-RAJAMOULI-R/

0 comments:

Post a Comment

 
Top