Menu

దేశ వ్యాప్తంగా జరిగిన రిపబ్లిక్ డే సంబరాల పై రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్య పరుస్తున్నాయి. కేవలం సినిమాల పైనే కాకుండా సామాజిక విషయాల పై రేణు దేశాయ్ పరిస్థుతులను బట్టి స్పందిస్తూ తన సామాజిక చైతన్యాన్ని తరుచు తెలియ చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంగానే రిపబ్లిక్ డే పై రేణు చాల భావ యుక్తంగా ట్విట్ చేసింది.1950 జనవరి 26న మన దేశానికి మొదటి రిపబ్లిక్ దినోత్సవం జరిగినప్పుడు సామాన్యుడు చెప్పే విషయాలను ప్రభుత్వాలు పట్టించుకునేవి. అయితే 2015 రిపబ్లిక్ డే జరిగే నాటికి సామాన్యుడు మాట్లాడే విషయాలను పట్టించుకోని స్థితిలోకి ప్రభుత్వాలు వెళ్ళి పోయాయి అంటూ తన సామాజిక చైతన్యాన్ని మరోసారి బయట పెట్టింది రేణు.

అంతేకాదు రిపబ్లిక్ డే ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఒబామా ఇండియా టూర్‌ పై కూడా ట్వీట్ చేసింది. మన దేశ ప్రధానులు ఎవరైనా అమెరికా పర్యటనకి వెళ్తే, వారికి అక్కడి ప్రజలు, మీడియా వాళ్లు అంత ప్రాధాన్యతని కల్పిస్తారా ? అంత గౌరవిస్తారా? అని సందేహం వ్యక్త పరుస్తూ మన ఇండియన్ మీడియా ఒబామా పర్యటనకు చేసిన హడావిడి గురించి పరోక్షంగా విమర్శలు చేసింది రేణు.కేవలం పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మిగిలి పోకుండా ఆమె ప్రతిరోజు వివిధ సామజిక అంశాలకు సంబంధించి రేణు స్పందిస్తున్న తీరు ఆమెలో కూడా ఇంత సామాజిక చైతన్యం ఉంది అని అనిపించే డట్లుగా చేస్తోంది.

0 comments:

Post a Comment

 
Top