March 18, 2025 12:43:27 PM Menu
Latest

6:28 PM test1



కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్ మూవీగా సంచలనం చేస్తున్న" ఐ " తెలుగులో 'మనోహరుడు' గా వస్తున్న సంగతి తెలిసిందే. 180 కోట్ల సినిమాగా ప్రచారం జరుగుతున్న ఈ సినిమాను గత మూడేళ్ళగా శంకర్ చెక్కుతున్నాడు. ఈ దీపావళికి దాదాపు 15వేల ధియేటర్లలో విడుదల అవుతుంది అని వార్తలలో నిలుస్తున్న ఈచిత్ర దర్శకుడు శంకర్ పారితోషికం విషయంలో కూడ రికార్డును క్రియేట్ చేసిందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.

ఈ సినిమాకు దర్శకత్వం చేసినందుకు దర్శకుడు శంకర్ కు ఈ సినిమా నిర్మాతల ద్వారా 20 కోట్ల పారితోషికం ముట్టింది అని టాక్. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ దర్శకుడు అందుకోనంత భారీ పారితోషికాన్ని శంకర్ అందుకుని రికార్డు క్రియేట్ చేసాడని మీడియా వార్తలు రాస్తోంది. 

  ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 15 చెన్నైలో గ్రాండ్ రేంజ్‌లో జరిగే ఈ ఆడియోకు ఇంటర్నేషనల్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ అతిధిగా వస్తున్నాడని న్యూస్. అంతేకాకుండా ఈ సినిమాను మరో ఇంటర్నేషనల్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ ఈ మూవీని ప్రమోట్ చేస్తాడని తెలుస్తోంది. ఏమైనా విడుదల కాకుండానే ‘ఐ’ సంచలనాలు చేస్తోంది.
29 Aug 2014

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top