పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , విక్టరి వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న చిత్రం గోపాల గోపాలా. ఈ చిత్రం హిందీలో ఓ మైగాడ్ పరేష్ రావల్ అక్షయ్ కుమార్ లు నటించిన విషయం తెలిసిందే అయితే హిందీలో ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ సాధించకున్నా ప్రజల్లో మంచి చైతన్యం కల్పించిన చిత్రంగా రూపుదిద్దుకొంది. అందుకే ఈ సినిమా కు మంచి డిమాండ్ ఏర్పడింది. తాజాగా నెల్లూరు ఏరియాకుగాను గోపాలా గోపాలా చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకోవడానికి హరి పిక్చర్స్ వారు రూ. 2.15 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నెల్లూరు ఏరియా మెగా హీరోల సినిమాలకు కంచుకోట లాంటిది. గతంలో రామ్ చరణ్ సినిమాలైన మగధీర, రచ్చ, నాయక్ చిత్రాలు ఇక్కడ 2 కోట్లకు పైగా వసూలు చేసాయి. పవన్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది ఈ నేపథ్యంలో గోపాలా గోపాలా' సినిమాకు 2.15 కోట్లు ఆఫర్ చేసి దక్కించుకున్నారు హరి పిక్చర్స్ వారు.
పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ అనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నెల్లూరు ఏరియాలో ఏ సినిమాకు కూడా రూ. 2.15 కోట్ల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రాలేదు. తెలుగు సినిమా చరిత్రలో నెల్లూరు టెర్రిటరీలో ఇదే హయ్యెస్ట్ అమౌంట్ అని అంటున్నారు. మరి వసూళ్ల పరంగా ఈచిత్రం ఎన్ని కార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
0 comments:
Post a Comment