గ్లామర్ ఉండగానే హీరోయిన్లు కెరీర్‌ని చక్కదిద్దుకోవాలి. నాలుగు కాసులు వెనకేసుకుంటే, హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక కూడా లగ్జరియస్‌గా లైఫ్ గడిపేయొచ్చు. కానీ ఆ విద్య కొందరికే తెలుస్తుంది. కాజల్ అగర్వాల్ ఆ కోవలోకే వెళ్తుంది. మిగతా హరోయిన్లలా కాజల్ అనవసర ఖర్చులు చేయదట. కానీ, కాజల్ చేతులు కాల్చుకోవడానికి సిద్ధమవుతుందంటున్నారు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొందరు. వెరైటీ మూవీస్, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌పై కాజల్ ఇంట్రెస్ట్ చూపిస్తుందట. 'నాకు నచ్చితే ప్రొడ్యూస్ చెయ్యడానికి సిద్ధమే' అని కాజల్ చెప్పిందంటూ, ఆమె పేరుని గాసిప్స్‌లోకి లాగారు.
కాజల్ వరకూ ఈ గాసిప్స్‌పై స్పందించలేదు. కెరీర్‌లో ఎప్పుడూ కాజల్ ప్రయోగాల జోలికి వెళ్ళలేదు. ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి అవసరమైనంత గ్లామర్ పండించడమొక్కటే కాజల్ చేసింది. లక్కీగా ఆమెకు 'మగధీర' లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ దక్కింది. కమర్షియల్ సక్సెస్‌లూ ఆమె కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి. కెరీర్‌లో ఎప్పుడూ ప్రయోగాలు చేయని కాజల్, నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంటుందంటే నమ్మలేం. అయితే నిప్పు లేకుండా పొగ పుట్టదుగా?
source: http://telugu.gulte.com/tmovienews/8542/Kajal-turns-to-producer#sthash.2rvcy3ig.dpuf
0 comments:
Post a Comment