సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ తాను అరెస్టు అయ్యాను అంటూ తన ట్విటర్ లో పెట్టిన ఫోటో నిన్న దేశవ్యాప్తంగా మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ లను చూసి అందరూ ఉలిక్కి పడ్డారు. అంతేకాదు అసలు వర్మను ఎందుకు అరెస్ట్ చేసారు అంటూ పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫోన్స్ రావడంతో వారు కూడ అయోమయంలో పడ్డారు.
అయితే జరిగిన అసలు విషయం వేరు. నిన్న వర్మ ఉదయం శ్రీనగర్ కాలనీలోని తన సన్నిహితుడి ఇంటికి వచ్చాడు. అతడితో మాట్లాడిన తరువాత తన స్నేహితుడి ఇంటి వద్ద తనకు కనిపించిన పోలీసి పెట్రోలింగ్ వెహికల్ వద్దకు వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నాడట. అయితే ఈ అనుకోని సంఘటనకు శాకు అయిన ఆ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్ వర్మను ఇతర వ్యక్తులు ఎవ్వరూ ఈ పోలీస్ వెహికల్ లో కూర్చోకూడదు అని చెప్పాడట.
అయితే వర్మ ఎప్పటి నుంచో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీసులకు సమకూర్చిన అధునాతన వాహనాలను చూడాలని అనిపించిందని అని చెప్పి తాను ఒక దర్శకుడిని అని తనకు తాను పరిచయం చేసుకున్నాడట వర్మ. అంతేకాదు అక్కడ ఉన్న తన మిత్రుడిని ఆ పోలీసు వెహికల్ లో తాను కూర్చున్న ఫోటోను తీయమని కోరడంతో ఆ ఫోటోను తీసాడట వర్మ స్నేహితుడు.
దీనితో ఆగకుండా కొద్ది సేపటికి వర్మ తన ట్విటర్ లో తాను అరెస్టు అయ్యాను అంటూ ఫోటోతో సహా ట్విట్ పెట్టాడు. దీనితో మీడియా ఛానల్స్ కూడా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేయడంతో ఉలిక్కి పడ్డ పోలీసు ఉన్నతాధికారులు అసలు విషయం తెలుసుకుని వర్మ ఓవర్ యాక్షన్ కు షాక్ అయ్యారు అని టాక్.
source:http://www.apherald.com/Movies/ViewArticle/80241/VARMA-ARREST-BECOMING-SHOCKING/

0 comments:
Post a Comment