Menu



“వీడు ఆరడుగుల బుల్లెట్టూ..ధైర్యం విసిరిన రాకెట్టూ” అంటూ పవన్ గురుంచి పాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ బుల్లెట్టుని కాస్త కుదించుకోవాలి. ఇది ఇప్పుడు ఆరడుగులు కాదు మూడడుగులే.! ఎందుకంటే సీనులో ఉంది పవన్ కల్యాణ్ కాదు బ్రహ్మానదం. ఆయన కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతుంది. దీనికి “మూడడుగులబుల్లెట్టు” అనే పేరు పెట్టారని సమాచారం. గప్ చిప్ గా సినిమా చిత్రీకరన జరిగిపోయింది. ఈ సినిమాతో ఓ కొత్త రచయిత పరిచయం కాబోతున్నాడు. ఆయన ఎవరనేది త్వరలో తెలుస్తుంది. బ్రహ్మి పక్కన ఓ కథానాయిక కూడా ఉంది. మాఫియా నేపధ్యంలో సాగే ఈ కథ ఆధ్యాంతం కామెడీగా నడుస్తుంది. పూర్తి వివరాలకోసం మరి కొన్ని రోజులు అగాల్సిందే.

0 comments:

Post a Comment

 
Top