Menu

టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ వేగంగా సినిమాలలో నటించకపోతున్నా రోజురోజుకీ మీడియా వార్తలలో మటుకు అత్యంత వేగంగా రకరకాల సంచలన వార్తలలో వినిపిస్తూ గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ‘పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను మొదలు పెట్టి ఆ సంస్థకు ఆ మధ్య భాగ్యనరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తాడని వార్తలు వచ్చాయి.

తన సన్నిహిత మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి కొత్త నటీనటులతో చిన్న సినిమాలను ఈ బ్యానర్ పై నిర్మిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ‘జనసేన’ హడావిడితో ఈ ఆలోచన వెనక్కు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ జీవం పోసుకున్న ఈ ఆలోచన ఇదే ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై సర్దార్ టైటిల్ ను రెండు రోజుల క్రితం టైటిల్ ను రిజిస్టర్ చేయించింది.

ఇప్పుడు ఈ వార్తలకు మరో ట్విస్ట్ ఇస్తూ పవన్ రామ్ చరణ్ తో సినిమాను తానే నిర్మాతగా మారి నిర్మించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు మరింత షాకింగ్ గా మారాయి. అంతేకాదు తన నిర్మాణ సంస్థ పై ఇతర హీరోలతోనూ పవన్‌ సినిమాలు నిర్మిస్తాడట. టాలెంటెడ్‌ రైటర్స్‌కీ, డైరెక్టర్స్‌కీ తన బ్యానర్‌లో పవన్‌ అవకాశం కల్పించనున్నాడట.

ఈ విషయాలకు సంబంధించి అధికారికంగా ప్రెస్ నోట్ కూడా విడుదల కావడంతో పవన్ నిర్మాతగా మారిన విషయంలో కూడా క్లారిటి వచ్చేసింది. రామ్ చరణ్ సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ పేరును పదేపదే అభిమానులు స్మరిస్తూ ఉంటే గతంలో అనేక సార్లు అసహనానికి లోనైన చిరంజీవి తన కుమారుడు చరణ్ సినిమాను పవన్ చేత తీయించడానికి అంగీకరించాడు అంటే గతంలో చిరంజీవి పవన్ ను ఉద్దేసించి అన్న మాటలు ‘తమ మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే’ అక్షర సత్యాలుగా మారాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/80189/UNEXPECTED-TWIST-IN-PAVAN-AND-CHARAN-ISUEE/

0 comments:

Post a Comment

 
Top