Menu

ఈరోజు పవన్ కళ్యాణ్ తుళ్ళూరు ప్రాంతంలో పర్యటిస్తున్నట్లుగా ఒక ప్రముఖ ఛానల్ కొద్ది సేపటి క్రితం బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. నిన్న చంద్రబాబును కలిసిన పవన్ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా చాల స్పీడ్ గా తన రాజకీయ ఎత్తుగడలను వేగం పెంచడానికి ఇద్దరు నాయకులు చేయబోతున్న రాజకీయ పర్యటనలకు చెక్ పెట్టే ఉద్దేశ్యంతో పవన్ ఈ స్పీడ్ ను పెంచాడు అని అంటున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతానికి సంబంధించి భూసేకరణ జరుగుతున్న గ్రామాలలో పర్యటనలు చేపట్టబోతున్నారు. అయితే ఊహించని మలుపుగా పవన్ జగన్ కన్నా ముందుగా తుళ్ళూరులో ఈరోజు పర్యటించి ఆ ప్రాంత రైతులను కలుసుకోవడం వెనుక పవన్ ఆలోచనలను ఒక ప్రముఖ రాజకీయ వేత్త ప్రభావితం చేసాడు అని టాక్.

అదేవిధంగా లోక్ సత్తా నాయకుడు జయప్రకాష్ కూడా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయాల పై రాజధాని ప్రాంత రైతుల సమస్యల పై విజయవాడలో ఒకరోజు నిరాహార దీక్షకు ఇదే వారంలో చేయడానికి నిర్ణయించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి రాజకీయనాయకుల పర్యటనలకు దీక్షలకు ముందు పవన్ వీరిద్దరికీ షాక్ ఇస్తూ రాజధాని నిర్మాణ ప్రాంతాల గ్రామాలలో పర్యటిస్తూ ఈరోజు జరుపుతున్న పర్యటన ఎటువంటి స్పందన ఇవ్వబోతోంది అన్నది రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

కోస్తా జిల్లాలలో విపరీతమైన అభిమానులు ఉన్న పవన్ కు అభిమానుల తాకిడే కాకుండా ఇప్పటికే గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడుగుతున్న రైతులకు ఎటువంటి సమాధానాలు చెపుతాడు అన్న విషయం ఈరోజు మీడియాకు టాపిక్ ఆఫ్ ది డేగా మారబోతోంది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/80257/PAVAN-STEPS--GETTING-TARGETTED-FOR-WHOM-/

0 comments:

Post a Comment

 
Top