Menu

Akshara-Haasan-kamal-haasan-daughter
సామాన్యంగా మీడియాలో సినిమా వాళ్ళ గురించి గాసిప్స్ వస్తూనే ఉంటాయి. అందులోనూ హీరోయిన్స్ గురించి ఎక్కువగ వినిపిస్తూ ఉంటాయి. అలాగని హీరోయిన్స్ వాటి గురించి పెద్దగా పట్టించుకోరు.దానికీ ఒక లాజిక్ ఉంది.తమపై వచ్చే గాసిప్పులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఇమేజ్ కూడా పెరుగుతుంది అని వాళ్ళ ఫీలింగ్.అయితే కమలహాసన్ చిన్న కూతురు అక్షరహాసన్ ను వెంటాడుతున్న భయాల గురించి ఆమె చెపుతుంటే మీడియాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

మీడియాలో తన పై గాసిప్పులు కనిపిస్తే అక్షర బెదిరి పోతుందట అంతేకాదు తన కెరియర్ కు ఇటువంటి గాసిప్పులు అడ్డుగా నిలుస్తాయని బెదిరిపోయి బెంగ పెట్టుకుందట అక్షర. అయితే అక్షర సన్నిహితులు మాత్రం శ్రుతిహాసన్ ను ఆదర్శంగా తీసుకుని సినిమా రంగంలో ఎదగాలి గాని మీడియా రాతలకు భయపడి పోవడం ఏమిటి అని అక్షరకు క్లాస్ పీకుతున్నట్లు టాక్.

ఈ వారం బాలీవుడ్ లో విడుదల కాబోతున్న ‘షమితాబ్’ సినిమాలో హాట్ లుక్స్ తో కనిపించడానికి భయపడని అక్షర ఇలా మీడియా గాసిప్పులకు భయపడటం ఆశ్చర్యకరమైన విషయమే. అందుకే కాబోలు ‘గబ్బర్ సింగ్ 2’ లో హీరోయిన్ పాత్ర ఇస్తానని పవన్ కబురు పెట్టినా ఆమె తాను ఆ పాత్రకు సరిపోను అని ఆ అవకాశాన్ని వదులుకున్నట్లుగా వచ్చిన వార్తలకు ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు అక్షర.

బాలీవుడ్ లో డేటింగ్ లకు భయపడని అక్షర గాసిప్పులకు భయపడటం వినే వారికి వింతగా అనిపిస్తుంది. కమలహాసన్ ధైర్యాన్ని శ్రుతి అంది పుచ్చుకుంటే ఆ తండ్రికే పుట్టిన అక్షర ప్రవర్తన ఎప్పుడు కమలహాసన్ కు అర్ధం కానిది అని అంటారు.


0 comments:

Post a Comment

 
Top