Menu

chiranjeevi
చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియక పోయినా ప్రస్తుతం ఆ సినిమాకు కేరళలోని ఒక ఆయుర్వేద థెరపీకి సంబంధం ఏర్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి ప్రస్తుతం కేరళలోని ఒక ప్రముఖ ఆయుర్వేద థెరపీ సెంటర్లో వారు చెప్పిన విధంగా డైటింగ్ చేస్తూ తన ముఖంలో ఆకర్షణను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్.

ఇప్పటికే తన 150వ సినిమా గురించి బాగా సన్నబడ్డ చిరంజీవి తన ముఖంలో ఎటువంటి ముడతలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి చిరంజీవి ఈ కేరళ ఆయుర్వేద థెరపీని ప్రస్తుతం కొనసాగిస్తున్నాడు అని టాక్. రాజకీయాలలో వచ్చిన తరువాత తిరిగి సినిమాలు చేయవలసిన పరిస్థితి అవసరపడుతుంది అని చిరంజీవి గతంలో అనుకోక పోవడంతో తన బాడీ లుక్స్ పై ఎటువంటి శ్రద్ధ కొన్ని సoవత్సరాల పాటు కనపరచక పోవడంతో చిరంజీవి తన 150వ సినిమాకు ఆకర్షణీయంగా కనిపించడానికి చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో ఈ కేరళ థెరపీ ఒకటి అని అంటున్నారు.

ప్రస్తుతం తన 150వ సినిమా కథల వేటలో ఉన్న చిరంజీవి ఈ కేరళ ఆయుర్వేద స్పాలో పరుచూరి బ్రదర్స్ కొత్తగా తయారుచేసిన రెండు, మూడు కథలను వింటూ కేరళ ఆయుర్వేద స్పా ఫుడ్ తింటూ తన ముఖ తేజస్సు పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మెసేజ్ తో కూడుకున్న వినోదాత్మక సినిమాగా తన 150వ సినిమా కథ ఉండాలి అని చిరంజీవి పట్టు పడుతూ ఉండటంతో చిరంజీవి కోరుకున్న వెరైటీ కథను అందించడం టాలీవుడ్ లోని రచయితలు అందరికీ ప్రస్తుతం ఒక పరీక్షగా మారిందని టాక్.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77704/KERALA-THERAPY-FOR-CHIRANGEEVI-MOVIE/

0 comments:

Post a Comment

 
Top