Menu

ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యంలో హై ఓల్టేజ్ ఎంటర్ టైనర్ సంస్థ రూపొందించిన టెంపర్ సినిమా బంపర్ హిట్ అయింది. అందాల నటి కాజల్ హీరోయిన్ గా చక్కటి కథ కధనంతో పూరీ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో ప్రదర్శించాడు.

ఈ చిత్రం 13 న విడుదలైన అన్ని సెంటర్లలో చక్కటి వసూళ్లు రాబట్టింది. సో మరి టెంపర్ చిత్రం వారాంతపు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా !

నైజాం 6. 21 కోట్లు, సీడెడ్ 3. 92 కోట్లు, గుంటూరు - వైజాగ్ - 5. 35 కోట్లు, ఈస్ట్ -వెస్ట్ - 2. 32 కోట్లు, కృష్ణ - నెల్లూరు - 1. 91 కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17. 82 కోట్లు షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కలిపి ఈ చిత్రం 20. 15 కోట్లు వసూలు చేసినట్టు సమంచారం.

ఈ నెలాఖరిలోగా ఈ సినిమా హైటెంపర్ సృష్టింస్తుందో ఈ సంవత్సరపు బంబర్ కలెక్షన్స్ రేంజ్ లో చేరుతుందో వేచిచూడాల్సిందే

source:http://www.apherald.com/Movies/ViewArticle/78963/temper-movie-collections-Temper-Box-Office-Collect/

0 comments:

Post a Comment

 
Top