సమంతకు వరస పెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో
రామ్ చరణ్ తో సినిమా చేయవలసిన సమంత చాన్స్ ను రకుల్ ప్రీత్ కొట్టుకు
పోయింది. సిద్ధార్థ్ తో బ్రేకప్ కారణంగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో
నటించవలసిన ‘బెంగుళూరు డేస్’ తెలుగు రీమేక్ చాన్స్ ను వదులుకున్న సమంత
స్థానంలో ఇప్పుడు తెలుగు అమ్మాయి శ్రీదివ్య వచ్చి చేరినట్లుగా వార్తలు
వస్తున్నాయి.
ముందుగా సిద్ధార్థ్ సమంతలను జంటగా ఈసినిమాకు అనుకున్న ఈ సినిమా దర్శక నిర్మాతలకు సిద్ధార్థ్ సమంతలు తమ గొడవలు కారణంగా ఈ సినిమాలో నటించలేము అని చెప్పడంతో సమంత స్థానాన్ని చాల ఆలోచించి శ్రీదివ్య చేత భర్తీ చేయిస్తున్నారు. తెలుగులో ‘మనసారా’, ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమాలోను నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీదివ్య ఇప్పుడు కోలీవుడ్ లో కూడా పాపులర్ హీరోయిన్.
అదీకాకుండా ఈ సినిమాను తమిళంలో కూడ డబ్ చేసే ఉద్దేశ్యంలో ఈ సినిమా నిర్మాతలు ఉండటంతో కోలీవుడ్ లో ప్రస్తుతం శ్రీదివ్యకు ఉన్న పాపులారిటీ తమకు కలిసి వస్తుందని ఆలోచన చేసినట్లు టాక్. సిద్దార్థ్ స్థానంలో మరే హీరోని ఎంపిక చేయక పోవడంతో శ్రీదివ్యతో నటించడానికి సిద్ధార్థ్ అంగీకరిస్తాడా అన్న ఉద్దేశ్యంతో మరో సారి సిద్ధార్థ్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఈ సినిమా దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న సిద్ధార్థ్ మనసు మారక పోవచ్చు అను అంటున్నారు. ఏది ఎలా ఉన్న మన తెలుగు అమ్మాయి సమంతకు గట్టి షాక్ ఇచ్చిందనే అనుకోవాలి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/79091/SAMANTA-GOT-SHOCK-FROM-TELUGU-GIRL/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.