Menu

సినిమా సెలబ్రిటీల పేరుతో ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ అక్కౌంట్లు కనిపిస్తూ ఉండటం సర్వ సాధారణం. సమాజంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అని తెలిసి కూడా ఆ ఫేస్ బుక్ అలాగే ఆ ట్విటర్ ఎకౌంట్లు నిజంగానే తమ అభిమాన సెలెబ్రెటీలవి అని భావిస్తూ మోసపోయిన సందర్భాలు గతంలో చాల జరిగాయి.

ఇక లేటెస్ట్ గా అక్కినేని అఖిల్‌ పేరుతో ఒక ఫేక్ ఫేస్‌ బుక్‌ అక్కౌంట్‌ ను అభినవ్‌ అనే వ్యక్తి ఓపెన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యక్తి ఈ ఫేక్ ఫేస్ బుక్ ద్వారా కొందరు అమ్మాయిలతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా గొంతు మార్చి ఫోన్ లో మాట్లాడుతూ కొందరు అమ్మాయిలకు ట్రాప్ చేసిన వ్యవహారం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

అయితే కొందరు అమ్మాయిలు ఈ ఫేక్ వ్యవహారాన్ని పసి గట్టడంతో ఈ వ్యక్తి వ్యవహారం పోలీసులు దాక వెళ్లింది . హీరోయిన్స్ ఫోటోలు మార్ఫింగ్ చేయడం హీరోల పేర్లతో ఫేక్ ఎకౌంట్స్ ఓపెన్ చేయడం ఫ్యాషన్ గా మారిన ప్రస్తుత పరిస్థుతులలో అఖిల్ ఫేక్ ఫేస్ బుక్ వ్యవహారం కూడా అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఈ వార్తలు ఇలా ఉండగా హీరోగా అఖిల్ అఫీషియల్ ఇంట్రడక్షన్ ఫంక్షన్ మొన్న శనివారం ఫ్యాన్స్ సమక్షంలో గ్రాండ్‌గా జరిగిన తరువాత అఖిల్ నిన్నటి నుండి తన తొలి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిన్న ఓల్డ్ సిటీలో ఒక యాక్షన్ సీన్ అఖిల్ పై చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78940/CHEATING-ON-THE-NAME-OF-AKHIL/

0 comments:

Post a Comment

 
Top