Menu

ఆ ఇద్దరు సినిమా తీస్తే సూపర్ హిట్టే.. ఇందులో ఏమాత్రం అనుమానమే ఉండదు. మరి ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే... మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లూ అర్జున్ అయితే మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివక్రమ్. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ''సన్నాఫ్ సత్యమూర్తి ''. కాగా ఈ చిత్ర ఆడియో వేడుక మార్చి 8న హైదరాబాద్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు జులాయి వంటి హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సీనిమాలో హీరోయిన్లు గా సమంత, నిత్యా మీనన్ ,ఆదా శర్మ , ముఖ్యపాత్రలుగా రాజేంద్రప్రసాద్ ,స్నేహ ,ఉపేంద్ర ,బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

గతంలో బన్ని-త్రివిక్రమ్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే నిర్మాత కాంబినేషన్‌లో వీరు ముగ్గురి కలయికలో వస్తున్న సినిమా కావడంతో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఆడియోతో పాటు సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ట్విస్ట్ ఏంటంటే..? ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారాన్ని బట్టి ఈ చిత్ర ఆడియోను మార్చి 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారనీ, ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అటెండ్ అవుతారని అనుకుంటున్నారు. ఇది నిజమే అయితే ఆడియే ఫంక్షనే ఒక భారీ ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు సినీ అభిమానులు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/80102/Allu-Arjun-Trivikram-Srinivas-Radhakrishna-S-o-Sat/

0 comments:

Post a Comment

 
Top