గోపాల గోపాల’ సినిమాలో ఒక పిల్లవాడికి తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన శ్రియ తాను ఎటువంటి పాత్రనైనా చేయగలను అని సంకేతాలు ఇచ్చింది. అంతేకాదు ఈమధ్యనే జరిగిన సిసిఎల్ క్రికెట్ టోర్న్ మెంట్ లో ఈమె చేసిన హడావిడి చూసిన చాల మంది గోపాలుడిలో నటించిన శ్రియ ఏనా? అని అనిపించేడట్లుగా చేసింది.
ఇక దీనికి కొనసాగింపుగా ఈమధ్య గోవాలో జరిగిన ‘బీచ్ ఫ్యాషన్ వీక్’ లో ఈమె తన ఎక్స్ పోజింగ్ తో చేసిన ర్యాంప్ వాక్ తో అందర్నీ అదరగొట్టింది. ఈ మధ్య కాలంలో బీచ్ ప్రాంతాలలో ఫ్యాషన్ వీక్ లు నిర్వహిస్తే స్పందన బాగా వస్తున్న నేపధ్యంలో ఇటువంటి షోలను గోవాలో ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు.
తల్లి పాత్రలను చేయడం వల్ల తన కెరియర్ కు ఎటువంటి నష్టం జరగదని ఈమధ్యనే ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన శ్రియ తన మాటలను నిజం చేస్తూ యంగ్ హీరోయిన్స్ తో సమానంగా ఆమె చేసిన ర్యాంప్ వాక్ మీడియాకు ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది.
అంతేకాదు ఆ ఫోటోలను వివిధ పత్రికలలో ప్రచురిస్తూ శ్రియ విశ్వరూపాన్ని చుపెడుతున్నారు. శ్రియ తన గ్లామర్ తగ్గిపోలేదు అని ఇటువంటి సంకేతాలు ఇస్తున్నా మన సీనియర్ హీరోలు మాత్రం ఆమెను పట్టించుకోకుండా యంగ్ హీరోయిన్స్ వైపు పరుగులు తీయడం ఆమె దురదృష్టం అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78129/SHREYA-HUNGAAMA-AT-BEECH/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.