Menu

sara-arjun-sridevi
ఒకనాటి చైల్డ్ ఆర్టిస్టుగా శ్రీదేవికి ఎంత క్రేజ్ వచ్చిందో ఆమె స్థాయిని మించి సారా అర్జున్ క్రేజ్ ఈరోజు దక్షణాది సినిమా రంగాన్ని షేక్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.కేవలం ఎనిమిదేళ్ళ వయస్సులో 100కు పైగా యాడ్స్ లో నటించి మరోవైపు సినిమాలను కూడా చేస్తూ భారతీయ సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ గా రికార్డు క్రియేట్ చేసిన బాలనటి సారా అర్జున్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి.

త్వరలో విడుదల కాబోతున్న ‘దాగుడుమూత దండాకోర్‌’ సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలుగా నటిస్తున్న సారా అర్జున్ గతంలో విక్రమ్ తో ‘నాన్న’ సినిమాలో విక్రమ్ కూతురుగా నటించింది. ఇప్పటికే అనేక అవార్డులు పొందిన ఈ చిన్నారి డాన్స్, ఫైట్స్ తన సహజత్వపు నటనతో దక్షిణాది సినిమా రంగాన్ని షేక్ చేస్తూ చిన్న పిల్లల పాత్రకు చిరునామాగా మారిపోయింది.

మొట్టమొదటి సారిగా తెలుగులో డైరెక్ట్ సినిమాను ‘దాగుడుమూత దండాకోర్’ సినిమా ద్వారా తన టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సారా అర్జున్కి అమోఘమైన భవిష్యత్ ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా త్వరలో విడుదల కాబోతున్న ‘దాగుడుమూత దండాకోర్’ సినిమాలో ఈ చిన్నారి చేసిన అమోఘమైన నటన ఈ సినిమాకు హైలెట్ గా మారుతుందని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలలో నటిస్తున్న ఈ చిన్నారి డేట్స్ కోసం కొంత మంది పెద్ద దర్శక నిర్మాతలు కూడా క్యూలో ఉన్నారు అంటే ఈ చిన్నారి రేంజ్ ఏమిటో అర్ధం అవుతోంది..

0 comments:

Post a Comment

 
Top